Headlines

బొబ్బిలి: పేదలకు నిత్యావసరాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బేబీ నాయన | రంజాన్ 2026

బొబ్బిలి నియోజకవర్గం
తేదీ 14-03-2026

బొబ్బిలి షాదీఖానాలో హుదా ముస్లిం సంక్షేమ సంస్థ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..

బొబ్బిలి పట్టణం, స్థానిక షాదీఖానాలో పవిత్ర రంజాన్ పర్వదినం నేపథ్యంలో హుదా ముస్లిం సంక్షేమ సంస్థ వారు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు హాజరయ్యారు. రంజాన్ పర్వదినం సందర్భంగా కులమతాలకు అతీతంగా హుదా ముస్లిం సంక్షేమ సంస్థ వారు 250 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు చేతులమీదుగా పంపిణీ చేశారు. అలాగే, విద్యారంగంలో ప్రతిభ చూపిన విశాఖకి చెందిన డా॥షాజిల్ నవాజ్ గారిని మరియు 20 సంవత్సరాలుగా భారత సైన్యంలో సేవలు అందించిన షేక్ పీరు గారిని ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు సత్కరించారు

ఈ కార్యక్రమంలో హుదా సంస్థ అధ్యక్షులు మొహమ్మద్ రఫీ గారు, హుదా సంస్థ కార్యదర్శి ఇంతియాజ్ గారు, మదర్సా ప్రిన్సిపాల్ హఫీజ్ అబుల్ కలాం గారు, జామియా మసీదు అధ్యక్షులు సయ్యద్ హాజీ పీరా గారు, కోఆప్షన్ సభ్యులు రియాజ్ ఖాన్ గారు తదితరులు పాల్గొన్నారు.

(PRO, MLA BBL)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *