Headlines

AP ఇంటర్ ఫలితాలు 2026: రేపు( ఏప్రిల్ 15 )ఉదయం 10:31 కి 1st & 2nd Year రిజల్ట్స్ విడుదల..ఎలా చెక్ చెయ్యాలంటే?

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. 2026 మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (IPE) ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) రేపు ( April 15 ) న విడుదల చేయనుంది.

ఫలితాల విడుదల వివరాలు:

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తాజా ప్రెస్ నోట్ ప్రకారం:తేదీ: 15 ఏప్రిల్, 2026* సమయం: ఉదయం 10:31 గంటల నుండి

ఎవరెవరికి?:

ఇంటర్ ప్రథమ (1st Year) మరియు ద్వితీయ (2nd Year) సంవత్సర విద్యార్థులకు

ఫలితాలను ఎలా చూసుకోవాలి? (How to Check Online)

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా పొందవచ్చు:

1. మొదట https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

2. అక్కడ మీ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.

3. ‘Get Results’ పై క్లిక్ చేయగానే మీ మార్కుల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది.

వాట్సాప్ ద్వారా ఫలితాలు (Check via WhatsApp):

ఇంటర్ బోర్డు ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం మరో కొత్త వెసులుబాటు కల్పించింది. కేవలం వాట్సాప్ ద్వారా కూడా మీరు రిజల్ట్స్ పొందవచ్చు:

మీ ఫోన్ నుండి 9552300009 అనే ‘Mana Mitra’ వాట్సాప్ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపడం ద్వారా మీ ఫలితాలను తెలుసుకోవచ్చు.

విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *