
టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బొబ్బిలి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు..

- సీనియర్ కార్యకర్తతో టీడీపీ జెండా ఆవిష్కరణ చేయించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..
- టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేసిన సీనియర్ కార్యకర్తలతో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు..
- పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన యువ కార్యకర్తలకు సన్మానం చేసిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..
తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ నేటికి 44 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు..బొబ్బిలి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మరియు పట్టణంలో ఉన్న ప్రతి వార్డులో టీడీపీ శ్రేణులు పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ ఆవిర్భావ వేడుకలను జరుపుకున్నారు.. అనంతరం, బొబ్బిలి కోటలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బొబ్బిలిలో వినూత్నంగా సీనియర్ కార్యకర్తలతో “జెండా ఆవిష్కరణ” మరియు “ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు” వేయించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..






బొబ్బిలి కోటలో బోడెల సింహాచలం అనే సీనియర్ టీడీపీ కార్యకర్తతో జెండా ఆవిష్కరణ చేయించారు.. అనంతరం, దక్షిణ దేవిడీ జంక్షన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ సీనియర్ కార్యకర్తలతో కలిసి వెళ్లి పూలమాలలు వేశారు..తదుపరి, కోటలో ఏర్పాటు చేసిన సభాప్రాంగణానికి చేరుకుని, మా తెలుగుతల్లికి మల్లెపూదండ పాటతో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులతో ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేయించడం జరిగింది.. వారిలో:
- కునుకు కృష్ణమూర్తి గారు
- చప్ప తిరుపతి గారు
- జాగాన రామకృష్ణ రంగారావు గారు
- దామెర సత్యనారాయణ గారు
- నంబియార్ వేణుగోపాలరావు గారు
- నారంశెట్టి తవిటశెట్టి గారు
- కెల్ల గౌరి గారు
- చందక కృష్ణ గారు
- కర్రి అప్పలనాయుడు గారు
అమరావతి పార్టీ కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు చేతులమీదుగా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కోటలో ఏర్పాటు చేసిన లైవ్ స్క్రీన్ లో వీక్షించారు.







గౌరవ బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు మాట్లాడుతూ, మొట్టమొదట సారి వినూత్నంగా సీనియర్ కార్యకర్తలతో ఈ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయమని, అలాంటి ఆలోచన చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారిని అభినందించారు.. తెలుగుదేశం పార్టీ సిద్ధాంత పరంగా పనిచేసే పార్టీ అని, ఎలాంటి భేషజాలకు పోకుండా సమన్వయంగా, క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్తలు ఉన్న పార్టీ అని అన్నారు..పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్న సిద్ధాంతాలను పాటిస్తూ ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా లొంగకుండా పనిచేసిన కార్యకర్తలే టీడీపీ బలం అని కొనియాడారు.
గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు మాట్లాడుతూ, నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు, మహిళలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.. ఎంతో చారిత్రాత్మకమైన ఈ కార్యక్రమంలో భాగమవ్వడం మన అదృష్టం అని అన్నారు..గత ప్రభుత్వ హయాంలో సామాన్య కార్యకర్త నుంచి నాయకులు వరకు పడిన బాధలు, కష్టాలు ఇంకెవరు పడి ఉండరని, ఒక దుర్మార్గపు పాలనతో టీడీపీ ని భూస్థాపితం చేయాలనే సంకల్పంతో వైసీపీ పనిచేసిందని, తోట చంద్రయ్య లాంటి కరుడుగట్టిన కార్యకర్తలను పొందిన గొప్ప పార్టీ టీడీపీ అని అన్నారు.. మన నియోజకవర్గంలో బాడంగి గ్రామంలో ఎరుకలపాక గ్రామంలో ఉండే మన పార్టీ వాళ్ళని ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, అయినా కూడా వారు లొంగకుండా టీడీపీ కోసం పనిచేశారని గుర్తుచేశారు.
2019-24 మధ్య ఖటినమైన ప్రయాణం చేశామని, అన్నిటికి ఓర్చుకుని నిలబడ్డామని అన్నారు..శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారుపై నమ్మకంతో ప్రజలు ఓటు వేసి, అధికారం ఇచ్చినందుకు రాష్ట్రానికి అద్భుతమైన పరిపాలన అందిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారన్నారు.. మన నాయకుడు జైల్లో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మనకి అండగా నుంచొని మద్దతు పలికారని, రాష్ట్ర భవిష్యత్తు కోసం మనతో కలిసి వచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.. అలాగే, NDA మద్దతుతో మన రాష్ట్రం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది అని పూర్తి విశ్వాసం ఉందని, అందుకు శ్రీ నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలిపారు..కూటమి నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో విజయం సాధించాము కాబట్టి, అందరితో కలిసి పనిచెయ్యాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు.
చివరగా, బొబ్బిలి నియోజకవర్గంలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన 30 మంది కార్యకర్తలను శ్రీ బేబీనాయన గారు మరియు శ్రీ లక్ష్మునాయుడు గారు కలిసి సత్కరించారు.. కార్యక్రమం పూర్తయిన తరువాత కోటలో అందరికీ భోజనం ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు, శ్రీ లక్ష్మునాయుడు గారు స్వయంగా వడ్డించారు.
ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
(PRO, MLA BBL)




