డా. శ్రీ రామ్ నరేష్ గారి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు..

బొబ్బిలి పట్టణంలో ప్రముఖ వైద్యులు డా.రామ్ నరేష్ గారు ఫ్లైఓవర్ పక్కన నూతనంగా నిర్మించిన ఆసుపత్రిని అక్టోబర్ 8 బుధవారం ఉదయం గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు, బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు కలిసి ప్రారంభించారు.








ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మాట్లాడుతూ, బొబ్బిలి నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో పేరు కలిగిన డా.రామ్ నరేష్ గారు అత్యాధునిక సదుపాయాలతో నూతనంగా ఆసుపత్రిని నిర్మించి, మన ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నందుకు వారిని అభినందిస్తూ, ప్రభుత్వం తరుపున ఎటువంటి సహాయం కావాలన్నా తాను అందుబాటులో ఉంటానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్వతీపురం కర్షక మహర్షి ఆసుపత్రి ఎండీ డా.శ్రీ ద్వారపురెడ్డి రామ్మోహన్ గారు, బొబ్బిలి కంటి ఆసుపత్రి ఎండీ డా.శ్రీ కోటగిరి అప్పారావు గారు, శ్రీ వేణుగోపాల నర్సింగ్ హోమ్ ఎండీ డా.శ్రీ గోపీనాథ్ గారు తదితరులు పాల్గొన్నారు.

