ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డుకు బొబ్బిలి పట్టణం ఎంపికయింది.



ఈ అవార్డు రావడానికి కారకులైన పారిశుద్ధ్య కార్మికులను అక్టోబర్ 10న గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, బొబ్బిలికి స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు దక్కడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర చాలా కీలకమని, వారి సేవలు వెలకట్టలేమని అన్నారు..వారు లేకపోతే ప్రజారోగ్యం కుంటుపడుతుందని, కోవిడ్ సమయంలో తమ ప్రాణాలని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన తీరు మరువలేనిదని కొనియాడారు.. వారియొక్క కృషి, భాద్యత వలన రాష్ట్ర స్థాయిలో బొబ్బిలి పేరు మారుమోగిందని, ఈ అవార్డు బొబ్బిలి ప్రజలకి ఇచ్చిన బహుమతి అని, బొబ్బిలి పట్టణానికి వారివలన దక్కిన అపూర్వ గౌరవం అన్నారు. బొబ్బిలి పేరును జాతీయ స్థాయిలో నిలుపుతారని, రానున్న రోజుల్లో ఇంకా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.. చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందిని మరొకసారి అభినందించారు.





అనంతరం, మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీ రాంబర్కి శరత్ గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి ఎల్ ఎల్.రామలక్ష్మి గారు, వార్డు కౌన్సిలర్లు, ఇంచార్జులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
(PRO, MLA BBL)