నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమాకి రంగం సిద్ధం – ‘ఆదిత్య 999 మ్యాక్స్’తో గ్రాండ్ ఎంట్రీకి ప్లాన్ !
నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఘడియ దగ్గరపడుతోంది. నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం కానున్న మొదటి సినిమాకి రంగం సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తాడు అన్న ఆసక్తికి ఇప్పుడు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, మోక్షజ్ఞ తొలి చిత్రం తెలుగు సినీ చరిత్రలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘ఆదిత్య 369’ సినిమాకి కొనసాగింపుగా రూపొందనుందని సమాచారం. ఈ చిత్రానికి…




