బొబ్బిలి నియోజకవర్గం
తేదీ 29-03-2026

గొల్లపల్లి గ్రామదేవత మరియు 12 గ్రామాల ఇలవేల్పు అయిన శ్రీ శ్రీ శ్రీ దాడితల్లి అమ్మవారు పండుగ సందర్భంగా సిరిమాను కోసం చెట్టును, బొబ్బిలిలో రాణీగారు తోటలో గుర్తించడం జరిగింది.. గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు ఈరోజు ఉదయం చెట్టుకి పూజ చేసిన తరువాత, ఆ చెట్టును కొట్టి మేళతాళాలతో బొబ్బిలి పురవీధులలో ఊరేగించి గొల్లపల్లి తీసుకువెళ్లారు.
సిరిమాను విశిష్టత (The Significance of Sirimanu)
“ఉత్తరాంధ్ర ఆచార వ్యవహారాలలో సిరిమాను ఉత్సవం అత్యంత విశిష్టమైనది. గొల్లపల్లి గ్రామదేవత, 12 గ్రామాల ఇలవేల్పు అయిన శ్రీ శ్రీ శ్రీ దాడితల్లి అమ్మవారి పండుగలో సిరిమాను ప్రధాన ఘట్టం. సిరిమాను అంటే ‘సిరి’ (సంపద) నిచ్చే ‘మాను’ (చెట్టు) అని అర్థం. అమ్మవారి ఆదేశానుసారం నిర్దిష్టమైన ప్రదేశంలో గుర్తించిన చింత చెట్టును (సిరిమాను) శాస్త్రోక్తంగా పూజించి, ఖండించి తీసుకురావడం ఒక పవిత్ర కార్యంగా భావిస్తారు. ఈ సిరిమానుపై అమ్మవారి పూజారి కూర్చుని భక్తులకు దర్శనమివ్వడం, గ్రామాల పురవీధుల్లో ఊరేగించడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఈ ఉత్సవం చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు, ఇలా చేయడం వల్ల గ్రామానికి సుభిక్షం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.”



(PRO, MLA BBL)




