సినిమా, మీడియా , డిజిటల్, అడ్వర్టైజింగ్
రంగాలలో 30ఏళ్ల అనుభవం ఉన్న శ్రీనివాస్ నేదునూరి
ETv, NTV, RTV, Prime 9 News లలో కంటెంట్ మరియు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన అనుభవం ఉంది. ఉషాకిరణ్ మూవీస్ ( RFC) చిత్రాలకు సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో సంధ్యారాగం సినిమాకు రచన, దర్శకత్వం వహించారు.ప్రస్తుతం సూత్రధారి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ అడ్వర్టైజింగ్ రంగంలో కూడా యాక్టీవ్ గా ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మనశంకరవారప్రసాదుగారు (MSG) సినిమా ప్రమోషన్స్ వేగంగా సాగుతున్నాయి. సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం టీమ్ నేడు వరుస కార్యక్రమాలతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది.
🔱 కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు
సినిమా ఘన విజయం కోసం టీమ్ సభ్యులు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో అభిమానులు భారీగా తరలివచ్చారు.
మీడియా ముందుకు వచ్చిన MSG టీమ్
ఆలయం అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో చిత్ర విశేషాలు, సంక్రాంతి విడుదలపై టీమ్ కీలక విషయాలు పంచుకుంది. మెగా – విక్టరీ కలయిక ప్రేక్షకులకు మాస్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా పూర్తి వినోదం అందిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.
🌾 నంబూరు సంక్రాంతి సంబరాల్లో సందడి
దర్శకుడు అనిల్ రావిపూడి నంబూరు గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో గ్రామస్తులతో కలిసి పండుగ వాతావరణాన్ని ఆస్వాదించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో జరిగిన MegaVictoryMass సాంగ్ లాంచ్ ఈవెంట్ అభిమానులను ఉత్సాహంతో ఉర్రూతలూగించింది.ఇప్పటికే విడుదలైన ఈ పాటను మేకర్స్“బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఆంథమ్ ఆఫ్ ది సీజన్” గా ప్రకటించారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో MSG
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌ల స్క్రీన్ ప్రెజెన్స్,అనిల్ రావిపూడి మాస్ టచ్, భీమ్స్ సిసిరోలియో సంగీతం కలిసి సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
గ్రాండ్ రిలీజ్ అప్డేట్
మనశంకరవారప్రసాదుగారుజనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమైన మెగా మాస్ + విక్టరీ క్లాస్ ఎంటర్టైనర్ ఇదే!