ఇప్పుడు ప్రపంచమంతా OGమయం.(OG )
భారతీయ సినీ పరిశ్రమలో సక్సెస్,ఫెయిల్యూర్ లకు అతీతంగా క్రేజ్ సొంతం చేసుకున్న ఒకే ఒక్క HERO ఆయన.
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్…
ప్రతి నాయకుల గుండెల్లో గుబులు ముట్టించే ఫైటర్ ,
జనసైనికులకు నిఖార్సయిన లీడర్ , ఆరడుగుల బుల్లెట్… ధైర్యం విసిరిన రాకెట్ …అతనే వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.(Power star Pawan Kalyan)

పవన్ కళ్యాణ్…
ఓ ప్రశ్న... వేల సమాధానాలు,
పవన్ కళ్యాణ్..
ఓ సమాధానం ..
లక్షలాది ఓదార్పులు,
పవన్ కళ్యాణ్…
ఓ బాధ్యత కోట్లాది జీవితాలు , పవన్ కళ్యాణ్… ఓ తత్వం,వేదాంతం, సిద్ధాంతం, అన్ని కలగలిపి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, (Ap DCM) భారతీయ సినిమా పరిశ్రమకు లభ్యమైన బాక్స్ ఆఫీస్ బంగారం.
తెలుగు చిత్ర సీమలో సమకాలీన కథానాయకులకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థాట్ ప్రాసెస్ కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ పవన్ కళ్యాణ్ కు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టింది. మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi) సోదరుడిగా ఈ అబ్బాయే కళ్యాణ్ అనే డిఫరెంట్ పోస్టర్ పబ్లిసిటీతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో టాలీవుడ్‌కు తెరంగేట్రం చేసి నేడు కోట్లాదిమంది ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని శిఖరాగ్రాన నిలుస్తాడని ఎవరు ఊహించి ఉండరు. సోదరుడి చిరంజీవి పేరు ఎంట్రీకి మాత్రమే పనికొస్తుందని , కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని అన్నయ్య బాటనే నమ్మి తన స్టామినా ఏంటో నిరూపించుకుని అన్నకు తగ్గ తమ్ముడుగా ఎదిగారు. జయాపజయాలకు అతీతంగా స్థిరమైన వసూల్ లో ఉన్న ఏకైక హీరో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.అటు ప్రజాసేవకు రాజకీయ రంగం ప్రవేశం చేసినా, ఇటు వినోదం పంచేందుకై సినీ కళామతల్లి సేవ చేసినాకోట్లాది హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడం ఒక్క పవన్ కళ్యాణ్ కీ చెల్లింది.అందుకు నిదర్శనం ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు వసూళ్లతోనే 154 కోట్లు బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసిన ఘనత పవర్ స్టార్ సొంతం.అటు రాజకీయాల్లోనైనా సరే తనదైన ముద్ర వేసి పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి నిలిచిన ఘనత జన సేన అధినేత పవన్ కళ్యాణ్ కే సొంతం. ఈ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని పబ్లిక్ టాక్ టీవీ ( public talk tv ) హృదయపూర్వకంగా కోరుకుంటూ, OG సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కొల్లగొడుతున్నందుకు అభినందనలు తెలుపుతోంది.
