సినిమా, మీడియా , డిజిటల్, అడ్వర్టైజింగ్
రంగాలలో 30ఏళ్ల అనుభవం ఉన్న శ్రీనివాస్ నేదునూరి
ETv, NTV, RTV, Prime 9 News లలో కంటెంట్ మరియు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన అనుభవం ఉంది. ఉషాకిరణ్ మూవీస్ ( RFC) చిత్రాలకు సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో సంధ్యారాగం సినిమాకు రచన, దర్శకత్వం వహించారు.ప్రస్తుతం సూత్రధారి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ అడ్వర్టైజింగ్ రంగంలో కూడా యాక్టీవ్ గా ఉన్నారు.
మెగా పవర్‌స్టార్ రామ్చరణ్ హీరోగా, సెన్సిబుల్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ షూటింగ్ దశలో వేగంగా సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఆమె పాత్ర పేరు అచ్చియ్యమ్మ. దేనికీ భయపడని, ఫైర్‌బ్రాండ్ లాంటి గ్రామీణ యువతిగా ఆమె కనిపించబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. తాజాగా విడుదలైన రెండు కొత్త పోస్టర్లలో జాన్వీ రస్టిక్ లుక్‌లో ఆకట్టుకుంది.
క్రీడా నేపథ్యంతో సాగే ఈ రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రామ్చరణ్ లుక్ కూడా అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
సమాంతరంగా భావోద్వేగాలు, గ్రామీణ నేపథ్యం, స్పోర్ట్స్ థీమ్ మేళవింపుగా రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.