Vijay Devarakonda car accident : విజయ్ దేవరకొండ కారు ప్రమాదం

సినీనటుడు విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు సోమవారం స్వల్ప ప్రమాదానికి గురైంది. 44వ జాతీయ రహదారిపై పత్తిమిల్లు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, విజయ్ దేవరకొండ పుట్టపర్తి వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా, ముందు వెళ్తున్న బొలెరో వాహనం సిగ్నల్ ఇవ్వకుండా పక్కకు తిప్పడంతో, వెనక వస్తున్న విజయ్ కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండ, ఆయన మేనేజర్ రవికాంత్ యాదవ్, డ్రైవర్ అందె శ్రీకాంత్ ఎవరూ గాయపడలేదు. కారుకు స్వల్ప నష్టం మాత్రమే జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం విజయ్ వెంటనే వెనకాలే వస్తున్న స్నేహితుల వాహనంలో వెళ్లిపోయారు.

Also Read : Vijay – Rashmika Engagement :విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్

డ్రైవర్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన బొలెరో డ్రైవర్ మహేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్.శేఖర్ వెల్లడించారు.

ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ ఆదివారం పుట్టపర్తికి బయలుదేరిన సమయంలోనే ఇదే మార్గంలోని ఘర్దాబా సమీపంలో గంటకు 114 కి.మీ. వేగంతో వెళ్తున్నందుకు రూ.1,035 చలాన్ పడిన విషయం కూడా బయటకు వచ్చింది. తెలంగాణ ఈ-చలాన్ పోర్టల్‌లో ఆ ఫొటో కూడా నమోదైనట్లు తెలిసింది.ఎవరూ గాయపడలేదని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *