


కంటెంట్ ఉన్న చిత్రాల ట్రెండ్ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ డిఫరెంట్ హర్రర్ & సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో విజయ చిత్ర ఫిల్మ్స్ ( VIJAYA CHITRA FILMS) పతాకంపై గుర్రపు విజయ్ కుమార్ తన తొలి ప్రయత్నంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంధ్యారాగం చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా పలు అవార్డులు సొంతం చేసుకున్న దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి దర్శకత్వంలో గుర్రపు విజయ్ కుమార్ నిర్మాతగా రవణం సత్యకుమార్, సునీతాప్రియ సహ నిర్మాతలుగా రూపొందిస్తున్న ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. విలేజ్ సెట్స్ , రామచంద్రాపురం స్ట్రీట్ సెట్స్ లో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయనిఈ మేకర్స్ తెలిపారు.
https://www.instagram.com/reel/DR86X6qEUTN/?igsh=enpnOWE2cDkzdHB5
చిత్ర హీరో MVR ( మూరంరెడ్డి వెంకటేశ్వర్లు)




ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గుర్రపు విజయ్ కుమార్ మాట్లాడుతూ…


30 ఇయర్స్ ఇండస్ట్రీగా టాలీవుడ్ లో పాపులారిటీ సొంతం చేసుకున్న వర్సటైల్ యాక్టర్ పృథ్వీ రాజ్ ( Pridhvi Raj, 30 years Industry) తనయ శ్రీలు ( Sreelu ), ఎంవిఆర్. (MVR )(మూరంరెడ్డి వెంకటేశ్వరులు)ప్రధాన పాత్రల్లో
విజయ చిత్ర ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న చిత్రం రామోజీ ఫిలిం సిటీ లో ఫస్ట్ షెడ్యూల్ సక్సస్ ఫుల్ గా కంప్లీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది.ఈ షెడ్యూల్ లో హీరో హీరోయిన్స్ తో పాటు సెకండ్ లీడ్ రోల్ లో నటిస్తున్న శివాంజనేయులు,, రఘు వీర్, వెంకట్ గుప్త పాల్గొన్న సన్నివేశాలు చిత్రీకరించారు.
అలాగే జబర్దస్త్ అప్పారావు, రామరాజు, పాండు గౌడ్,,VT రాజు, విశాల్, ఆర్యఫణి నటించిన సన్నివేశాలు చిత్రీకరించడం జరిగిందనీ తదుపరి షెడ్యూల్ అతి తొందరలోనే స్టార్ట్ చేసి న్యూ ఇయర్ సందర్భంగా టైటిల్ రివీల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

చిత్ర దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి మాట్లాడుతూ…

హార్రర్ చిత్రాల్లో డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్న సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందిస్తున్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ RFC లో సక్సస్ ఫుల్ పూర్తిచేసినందుకు చిత్ర యూనిట్ కు, రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యానికి , కథ వినగానే మా టీమ్ ను ప్రోత్సహించిన నా గురుతుల్యులు ,నా అభిమాన నటులు శ్రీ పృథ్వీ గారికి కృతజ్ఞతలు. .షూటింగ్ సజావుగా సాగేందుకు అన్నీ సమకూర్చిన నిర్మాత గుర్రపు విజయ్ కుమార్ గారికి, ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యమైన సహ నిర్మాతలు రవణం సత్య కుమార్ గారికి, సునీతాప్రియ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.



చిత్ర సహ నిర్మాత రవణం సత్యకుమార్ మాట్లాడుతూ….


నిర్మాత గుర్రపు విజయ్ కుమార్, దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి నాకు మంచి స్నేహితులు కావడంతో ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారని తెలిపారు.ఈ మూవీలో జాతర నేపధ్యంలో వచ్చే ఒక పాట రాస్తున్నానని,ఈ చిత్రం పూర్తయిన తరువాత నేను రాసిన ఓ డిఫరెంట్ యూత్ ఫుల్ కథతో ఇదే సంస్థలో గుర్రపు విజయ్ కుమార్, శ్రీనివాస్ నేదునూరి కాంబోలో మరో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు.విజయదశమి రోజున పూజా కార్యక్రమాలు కూడా జరిగాయని అతి తొందరలో ప్రొడక్షన్ నెంబర్ 2 లాంచ్ కాబోతుందని అన్నారు.
ఈ చిత్ర మరో సహ నిర్మాత అయిన సునీతాప్రియ మాట్లాడుతూ…..


మా ప్రొడ్యూసర్ గారు, డైరక్టర్ గారు పెర్ఫెక్ట్ ప్లానింగ్ చేయడం వల్లనే షూటింగ్ సజావుగా సాగుతోందని, ప్రేక్షకులకు కావాల్సిన సెంటిమెంట్, థ్రిల్లింగ్, హార్రర్, యూత్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న కమర్షియల్ సినిమాలో బాగమయినందుకు సంతోషంగా ఉందని అన్నారు.
ఈ చిత్ర హీరో MVR ( మూరంరెడ్డి వెంకటేశ్వర్లు) మాట్లాడుతూ…

ఓ సరికొత్త హార్రర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోగా అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. టీమ్ వర్క్ తో ..రాజీపడకుండా తెరకెక్కిస్తున్నారని అన్నారు. నేను హీరోగా చేసిన ఇంద్రావతి మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.అలాగే కన్నడ లో “ది ఐస్” అనే మూవీలో హీరోగా చేసాను.ఈ మూవీ కూడా రిలీజ్ కి రెడీ గా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ చిత్ర కథానాయిక శ్రీలు మాట్లాడుతూ…

హార్రర్ చిత్రాల్లో ఓ డిఫరెంట్ జానర్ చిత్రమని, నేను చేసిన కార్తీక పాత్ర ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు.
ఈ చిత్రంలో సెకండ్ లీడ్ చేస్తున్న శివ మాట్లాడుతూ…

ఈ సినిమాలో నా రోల్ ఖచ్చితంగా మంచి పేరు తీసుకువస్తుందని, ఇటీవల విడుదలైన నేను లీడ్ రోల్ చేసిన యజ్ఞ చిత్రం తరువాత అవకాశం వచ్చిన ఈ మూవీ డిఫరెంట్ అటెంప్ట్ అని అన్నారు.
ఇంత మంచి కంటెంట్ ఉన్న చిత్రంలో యూత్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఫుల్ లెంగ్త్ రోల్ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు రఘువీర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ మూవీలో మరో ముఖ్యమైన రోల్ చేస్తున్న వెంకట్ గుప్త ఈ మూవీ తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ మూవీలో లోకల్ యూట్యూబర్స్ గా నటిస్తున్న విశాల్, ఆర్యఫణి దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.


అలాగే ఈ మూవీలో అద్భుతమైన రోల్ పోషిస్తున్న జబర్దస్త్ అప్పారావు,మరియు రామరాజు మాట్లాడుతూ…

యూత్ కు నచ్చే అన్ని అంశాలతో పాటు ఓ సామాజిక స్పృహతో ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న అంశాలను మేళవించి, కుటుంబ బంధాల నేపధ్యంలో హార్రర్ జానర్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మంచి పాత్ర పోషిస్తునందుకు హ్యాపీగా ఉందని అన్నారు..

బీఎస్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఎడిటర్ గా SS సుంకర, మెలోడీ శ్రీనివాస్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మంచి స్టోరీలో కథను మలుపుతిప్పే రోల్ చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ చిత్రం సక్సస్ ఫుల్ గా పూర్తి చేసి విడుదలై, విజయం సాధించాలని నటులు పాండు గౌడ్ గారు, VT రాజు గారు,జనార్ధన్ గారు,మహేష్ గారు ఆకాంక్షించారు.







