బొబ్బిలి : పబ్లిక్ టాక్ టీవి (గుర్రపు విజయ్ కుమార్, శ్రీనివాస్ నేదునూరి)
బొబ్బిలి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వి.ఎస్.కే.కే. రంగారావు (బేబీ నాయన) గారి సూచనల మేరకు, బొబ్బిలి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమం 15-10-2025: రోజున నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బొబ్బిలి గౌరవ డీఎస్పీ శ్రీమతి జి.భవ్యా రెడ్డి గారు విద్యార్థులకు కౌన్సిలింగ్ అందించారు.
Dsp మాట్లాడుతూ, విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపుతూ, క్రమశిక్షణతో ప్రగతికి ముందుకు సాగాలని సూచించారు. చెడుమార్గాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల దుష్ప్రభావాలను వివరించారు. విద్యార్థులకు ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రతి విద్యార్థి 1st క్లాస్ లో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.
అలాగే, ప్రిన్సిపల్ అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని, బయటవారు ఇచ్చే ఆహారం తీసుకోవద్దని, ఏవైనా సమస్యలు ఎదురైతే ఫీడ్‌బ్యాక్ పుస్తకంలో నమోదు చేయమని సూచించారు. ఈరోజు నుంచి రెసిడెన్షియల్ స్కూల్లో “పాయింట్ బుక్”ను అమలు చేయనున్నట్లు, నైట్ పేట్రోలింగ్ వాహనం ప్రతిరోజూ చెక్ చేస్తుందని తెలిపారు.
గౌరవ ఎమ్మెల్యే శ్రీ బేబీ నాయన గారు పాఠశాలపై చూపిస్తున్న శ్రద్ధకు రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారుధన్యవాదాలు తెలిపారు. డీఎస్పీ గారు తమ బిజీ షెడ్యూల్‌లో సమయాన్ని కేటాయించి విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.