Headlines

మెగా రక్తదాత శ్రీ కూన పరమేశ్వర్ అభినందన సభ: 90 సార్లు రక్తదానం చేసిన మహా మనిషి

మెగా రక్తదాత
శ్రీ కూన పరమేశ్వర్ గారికి హృదయపూర్వక అభినందనలు

హైద్రాబాద్ – కర్మన్ ఘాట్ వాస్తవ్యులు
శ్రీ K . పరమేశ్వర్ ( B -ve )గారు ఈరోజు చిరంజీవి బ్లడ్ సెంటర్ లో 79 వ సారి Blood Donation చేయడమే, కాకుండా ఇంత వరకు అత్యవసర పరిస్థితుల్లో బయటి హాస్పిటల్స్ లో కలుపుకుని 90 సార్లు రక్తదానం చేయడం అభినందనీయం .

వారి ఉన్నతమైన మనస్తత్వానికి మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి తరపున శ్రీ కే. పరమేశ్వర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.

రక్తం దొరకక ఎవరూ చనిపోకూడదు అనే మెగా స్టార్ శ్రీ చిరంజీవి గారి ఆశయాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్న శ్రీ K.పరమేశ్వర్ గారి లాంటి రక్తదాతలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు .

శ్రీ కూన పరమేశ్వర్ గారికి,వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…

చిరంజీవి బ్లడ్ సెంటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *