జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు శ్రీకొణిదెల నాగబాబు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు .
మెగాస్టార్ శ్రీ చిరంజీవిగారికి లక్ష్మణుని అండగా.. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అన్నగా తోడుగా.. ఇద్దరు చెల్లెమ్మలకు ఆత్మీయ అన్నయ్యగా..
మెగాభిమానులను ముందుండి నడిపే రథసారథిగా .. శ్రీ నాగబాబు గారి జీవనం, ప్రయాణం ఎంతో స్పూర్తిమంతం ..
నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి & ఎమ్మెల్సీగా శ్రీ నాగబాబు గారు మెగా కుటుంబానికే కాదు.. మెగాభిమానులకు సైతం ఎంతో ఆదర్శనీయులు.
ఆలోచన.. ఆచరణ, నిజాయితీ.. నిబద్ధత, క్రమశిక్షణ.. మొక్కవోని దీక్ష, శాంతి మార్గం..అవసరమైతే ఆవేశం ఆయన సొంతం.
జనసైనికులు & మెగా అభిమానులతో మమేకమై, కుటుంబానికీ, రాజకీయానికీ సమతుల్యమైన సమయం కేటాయిస్తూ ముందుకువెళ్తున్న శ్రీ నాగబాబు గారికి మా అశేష మెగాభిమానులు & జనసైనికుల తరపున నిండు మనసులతో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుతెలియజేస్తున్నాం .
శ్రీ నాగేంద్ర బాబు గారి ప్రయాణంలో మరిన్ని మజిలీలు చేరుకోవాలని.. ప్రజాక్షేత్రంలో ప్రజామన్ననలు గెలవాలని.. ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..