సినిమా, మీడియా , డిజిటల్, అడ్వర్టైజింగ్
రంగాలలో 30ఏళ్ల అనుభవం ఉన్న శ్రీనివాస్ నేదునూరి
ETv, NTV, RTV, Prime 9 News లలో కంటెంట్ మరియు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన అనుభవం ఉంది. ఉషాకిరణ్ మూవీస్ ( RFC) చిత్రాలకు సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో సంధ్యారాగం సినిమాకు రచన, దర్శకత్వం వహించారు.ప్రస్తుతం సూత్రధారి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ అడ్వర్టైజింగ్ రంగంలో కూడా యాక్టీవ్ గా ఉన్నారు.
హైదరాబాద్: అల్లు కుటుంబంలో మరో శుభవార్త. హీరో **అల్లు శిరీష్** త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారు. నయనికతో ఆయన నిశ్చితార్థం శుక్రవారం హైదరాబాద్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు కొద్దిమంది బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు.
చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలో పాల్గొని నవ దంపతులకు ఆశీర్వాదాలు అందించారు. శిరీష్–నయనికలు ఉంగరాలు మార్చుకున్న క్షణాలు ఆనందభరితంగా మారాయి.
నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో వైరల్‌గా మారి అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి