సినిమా, మీడియా , డిజిటల్, అడ్వర్టైజింగ్
రంగాలలో 30ఏళ్ల అనుభవం ఉన్న శ్రీనివాస్ నేదునూరి
ETv, NTV, RTV, Prime 9 News లలో కంటెంట్ మరియు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన అనుభవం ఉంది. ఉషాకిరణ్ మూవీస్ ( RFC) చిత్రాలకు సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో సంధ్యారాగం సినిమాకు రచన, దర్శకత్వం వహించారు.ప్రస్తుతం సూత్రధారి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ అడ్వర్టైజింగ్ రంగంలో కూడా యాక్టీవ్ గా ఉన్నారు.
హైదరాబాద్: భారత ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్. పటేల్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ వద్ద నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి (@KChiruTweets) గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి గారు మాట్లాడుతూ, ఇలాంటి జాతీయ ఐక్యత కార్యక్రమాల్లో భాగమవ్వడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “దేశం అభివృద్ధి పథంలో ఏకతా మరియు సౌభ్రాతృత్వం ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రజల్లో ఐక్యతా భావం పెంపొందించడంలో ఈ తరహా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తినిస్తాయి,” అని అన్నారు.
అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన డీజీపీ, పోలీస్ కమిషనర్ మరియు మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను చిరంజీవి అభినందించారు. ప్రజల్లో దేశభక్తి, ఐక్యత భావాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
రన్ ఫర్ యూనిటీలో పలువురు పోలీసులు, యువత, క్రీడాభిమానులు పాల్గొని దేశ ఐక్యతకు తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా, జాతీయ ఐక్యత సందేశంతో సాగింది .