Headlines

HERO Guduguntla Mahesh : సార్ జాంబి మూవీ హీరో మహేష్ స్పెషల్ స్టోరీ

మట్టి పరిమళాలనుండి …వెండితెరపై తారలా!
ఓ అడుగు వేస్తే అడ్డంకులే దారి చూపుతాయి
కష్టమే అతని ఆయుధం … కలలే అతని శక్తి
తెరపైనే కాకుండా… ప్రేక్షకుల హృదయంలో హీరోగా స్థానం సంపాదించిన గుడుగుంట్ల మహేష్
నటననే జీవిత మార్గంగా ఎంచుకున్న అంకితభావంగల నటుడు
ప్రతి పాత్రలో నిజాయితీ, ప్రతి అడుగులో పట్టుదల.
తెలుగు సినిమాకు కొత్త శక్తిగా వెలుగుతున్న కొత్త తరం నటుడు గుడుగుంట్ల మహేష్

ఫిలిం ఇండస్ట్రీ లో ఎదగాలంటే బ్యాక్ గ్రౌండ్ ఉండాలి ..ఇది ఒకప్పటి మాట.
కృషి,పట్టుదలతో నిజాయితీగా పయత్నిస్తే అనుకున్నది సాధించవచ్చని నిరూపించారు గుడుగుంట్ల మహేష్.
తెలుగు సినిమా ప్రపంచంలో ప్రతి ఒక్కరి ప్రయాణం ఒక కథ.అలాంటి ఓ ప్రేరణాత్మక కథ గుడుగుంట్ల మహేష్‌ది.

నల్లగొండ జిల్లాలోని చిన్న గ్రామంలో జన్మించిన మహేష్ చిన్నప్పటి నుంచే చిరంజీవి గారు, నాగార్జున గారు వంటి మహానటుల నటనతో మంత్ర ముగ్ధుడయ్యాడు. వారి స్ఫూర్తితో ఆయనలో నటనపై అభిరుచి పుట్టింది — ఆ అభిరుచి క్రమంగా ఆశయంగా , ఆపై జీవిత లక్ష్యంగా మారింది.

నటన పట్ల ఆసక్తి నుండి రంగప్రవేశం వరకు
తన గ్రామం నుంచి సినీ రంగానికి చేరుకోవడం సులభం కాదు. కానీ మహేష్ తన నిబద్ధత, అంకితభావం, కష్టపడి పనిచేసే ధోరణితో ముందుకు సాగాడు. ఎన్నో సవాళ్లు ఎదురైనా వెనక్కి తగ్గకుండా తన కలను సాకారం చేసుకోవడానికి నిరంతరంగా శ్రమించాడు.
ఈ క్రమంలో “సార్ జాంబి”, “అంతం”, “క్రాస్ రోడ్స్”, “దుమారం” వంటి చిత్రాలలో నటించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

సార్ జాంబి”లో హీరోగా మహేష్


మహేష్‌కి నటనలోని వైవిధ్యాన్ని గుర్తించిన దర్శకుడు శ్రీ ఎన్. ఎన్. రాజు గారు ఆయనలోని ఫ్యాషన్, అభిరుచి, నటనా సామర్థ్యాన్ని గుర్తించి, “సార్ జాంబి” సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు.
ఈ చిత్రాన్ని ఎం. ఎన్. నాగేశ్వరరావు గారు నిర్మించగా, మహేష్ తన జీవితంలోని అతి ముఖ్యమైన పాత్రగా దీన్ని భావిస్తున్నాడు.
ఈ సినిమాలో హీరోగా ఆయన పోషించిన పాత్రలో ఎన్నో షేడ్స్ ఉండటం, ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇవ్వబోతోందని చెబుతున్నారు.

సార్ జాంబి చిత్ర టీజర్ ఆకట్టుకుంటోంది.. మీరూ ఒక లుక్కేయండి.

కృతజ్ఞతతో ముందుకు
ఈ అవకాశం తన జీవితాన్ని మలిచిందని మహేష్ చెబుతూ —

“నా అభిరుచిని, నా కృషిని గుర్తించి నన్ను హీరోగా తీర్చిదిద్దిన దర్శకుడు శ్రీ ఎన్. ఎన్. రాజు గారికి, నిర్మాత ఎం. ఎన్. నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.
అలాగే, ఆయన నమ్మకం – “నా నటనను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని, నన్ను నటుడిగా నిలబెడతారని.”మహేష్ తన ప్రతి అడుగులోనూ దేవుని ఆశీర్వాదం, తన అభిమానుల ప్రేమను నమ్మి ముందుకు వెళుతున్నారు.

పట్టుదలతో ముందుకు సాగుతున్న నటుడు
మహేష్ యొక్క కథ ఒక ప్రేరణ. చిన్న గ్రామం నుంచి పెద్ద కలలు కనడం, ఆ కలలను నిజం చేయడానికి ప్రయత్నించడం, ప్రతి అవరోధాన్ని కృషితో అధిగమించడం అంటే మామూలు విషయం కాదు.కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా, తన వ్యక్తిత్వంలో సైతం నంబర్ వన్. . క్రమశిక్షణ, వినమ్రత, కృషి – ఇవన్నీ కలిపి మహేష్‌ని రేపటి స్టార్‌గా నిలబెట్టే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.
తెలుగు సినీప్రేక్షకుల ఆశీస్సులు, అభిమానులు చూపించే మద్దతు ఆయనకు మరింత ప్రేరణగా నిలుస్తాయి.


చిన్ననాటి నుంచే నటన అంటే ఆసక్తి, కథలపై ఆకర్షణ — ఇవే మహేష్ జీవితాన్ని సినీప్రయాణ దిశగా మలిచాయి. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని, ప్రతి అవకాశాన్ని నేర్చుకునే వేదికగా తీసుకుని, ఒక్కో పాత్రలో తన ప్రతిభను నిరూపిస్తూ , ఎన్నో అవార్డులు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.

తనకు ప్రేరణగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునల మాదిరిగా విభిన్న పాత్రలతో, వైవిధ్యభరితంగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్న మహేష్ కళ( ల )లు నెరవేరాలని,
తనలోని ప్రతిభ, కృషి, పట్టుదలతో తెలుగు సినీ రంగంలో స్థిరమైన గుర్తింపు పొందాలని, త్వరలో రిలీజ్ కాబోతోన్న సార్ జాంబీ చిత్రం సూపర్ హిట్ అవ్వాలని పబ్లిక్ టాక్ టీవీ వెబ్సైట్ కోరుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *