Sabarimala New Guidelines 2025: శబరిమల యాత్రపై కేరళ ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు – భక్తులకు తప్పనిసరి సూచనలు

శబరిమలలో యాత్రీకుల రద్దీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం భక్తుల కోసం కీలక సూచనలు విడుదల చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయాలు 24 నవంబర్ 2025 వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.

రోజువారీ అనుమతులు – వర్చువల్ క్యూ తప్పనిసరి

  • రోజుకు 70,000 మంది వర్చువల్ క్యూ ద్వారా మాత్రమే దర్శనం పొందవచ్చు.
  • అదనంగా 5,000 మంది భక్తులకు స్పాట్ బుకింగ్ ద్వారా అనుమతి ఉంది.
  • చెల్లుబాటు అయ్యే వర్చువల్ క్యూ పాస్ లేకపోతే నీలక్కల్ నుంచి శబరిమలకి ప్రవేశం లేదు.

స్పాట్ బుకింగ్ కోటా వివరాలు

  • రోజుకు 5,000 పాస్‌లు మాత్రమే జారీ చేస్తారు.
  • కోటా పూర్తయితే ఆ రోజు మరిన్ని బుకింగ్‌లు లేవు.

స్పాట్ బుకింగ్ కేంద్రాలు:

  • నీలక్కల్
  • వండిపెరియార్ – సత్రం
  • ఎరుమెలి
  • చెంగన్నూర్

నీలక్కల్ కేంద్రంలో కోటా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అందువల్ల భక్తులు వీలైతే ఇతర బుకింగ్ కేంద్రాల్లోనే పాస్‌లు తీసుకోవాలని సూచించారు.

యాత్రికులు తప్పనిసరిగా గమనించాల్సిన విషయాలు

  • శబరిమల బయలుదేరే ముందు వర్చువల్ క్యూ పాస్ తమ వద్ద ఉన్నదని నిర్ధారించుకోవాలి.
  • నీలక్కల్, పంపా, సన్నిధానం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలకు భక్తులు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

శబరిమల హెల్ప్‌లైన్ నంబర్లు

  • సాధారణ హెల్ప్‌లైన్: 14432
  • ఇతర రాష్ట్రాల భక్తుల కోసం: 04735-14432

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *