Headlines

Shiva Movie: శివ రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి ట్వీట్ కు ఆర్జీవీ రిప్లై

వ్యక్తిత్వంలో ఆయనొక శిఖరం…
అందుకే “చిరంజీవి” గారి కీర్తి అనితర సాధ్యం..!!🙏🙏🙏Megastar #Chiranjeevi గారికి తెలిసింది ఒకటే –
ప్రేమ ప్రేమ ప్రేమ!

మెగాస్టార్ చిరంజీవి గారి వ్యక్తిత్వం గురించి ఎందుకు మళ్ళీ ప్రస్తావించవలసి వచ్చిందంటే శివ మూవీ రిలీజ్ సందర్భంగా శివ టీంను అభినందిస్తూ చిరు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తన తొలి సినిమా ‘శివ’ (Shiva) రీ రిలీజ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ధన్యవాదాలు చెబుతూ క్షమాపణలు కూడా కోరారు.
చిరంజీవి తన సందేశంలో, శివ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు కొత్త నిర్వచనం ఇచ్చింది. అది సినిమా కాదు ఓ విప్లవం. నాగార్జున యాక్టింగ్ అద్భుతం, అమల, రఘువరన్ వంటి నటుల ప్రదర్శన అద్భుతం. ఆర్జీవీ కెమెరా యాంగిల్స్, లైట్స్, సౌండ్ వర్క్ వావ్ అనిపించాయి. ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని అప్పుడే నాకు అనిపించింది” అని పేర్కొన్నారు.

దీనికి స్పందించిన ఆర్జీవీ తన ఎక్స్ (X/Twitter) అకౌంట్‌లో, “థాంక్స్ చిరంజీవి గారు. అనుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి. విశాల హృదయంతో మా టీమ్ని విష్ చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు”అని ట్వీట్ చేశారు.


ఇద్దరి మధ్య సాగిన ఈ మాటల మార్పిడి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అభిమానులు వీరిద్దరి మధ్య ఆగిపోయిన ప్రాజెక్ట్ “వినాలని ఉంది” సినిమాను గుర్తు చేసుకుంటున్నారు.

1989లో విడుదలైన ‘శివ’ సినిమా తెలుగు సినీ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మాస్టర్‌పీస్‌గా గుర్తించబడింది. నాగార్జున, అమల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 36 ఏళ్ల తర్వాత నవంబర్ 14న రీ రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *