బొబ్బిలి నియోజకవర్గం
తేదీ 10-11-2025, PUBLIC TALK TV BHAKTHI
ప్రతియేటా కార్తీక మాసమునందు బొబ్బిలి కోటలో అయ్యప్ప పడిపూజను గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు జరిపిస్తారు..











ఈరోజు ఉదయం గం॥8:30 లకు అయ్యప్ప పడిపూజను ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ప్రారంభించారు.. ఈ పూజలో సుమారు 2500 మంది అయ్యప్ప స్వాములు, భవానీలు, శివ స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.. శ్రీ మరడాన రవి గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ, భజనలు జరిగాయి. అనంతరం, స్వాములకు కోటలో భిక్షను ఏర్పాటు చేయడం జరిగింది. స్వాములందరి భిక్ష అయినంతవరకు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించి, ఆఖరున భోజనం చేశారు.






ఓం స్వామియే శరణం అయ్యప్ప 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐