ఆత్రేయపురం బ్రదర్స్ ప్రారంభం: ‘ఏ స్వీట్ రైవల్రీ’ ఆకట్టుకుంటున్న కాన్సెప్ట్ పోస్టర్!
పబ్లిక్ టాక్ టీవీ :ఫిలిం న్యూస్: మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా వైవిధ్యభరితమైన కథాంశంతో ‘ఆత్రేయపురం బ్రదర్స్’ చిత్రం పట్టాలెక్కింది. రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ప్రముఖుల సందడి ఈ ప్రారంభోత్సవ వేడుకకు దర్శకులు వశిష్ట, అనుదీప్ కె.వి, ఆదిత్య హాసన్, ప్రవీణ్ కాండ్రేగుల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వశిష్ట క్లాప్ కొట్టగా, విజయ్…




